గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో టీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురవుతోంది. అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీపైనా ఒత్తిడి పెరిగింది. మంత్రి రజని భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్‌ కాపు ఈక్వేషన్‌లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్‌ చేసింది వైసీపీ. వైసీపీ వ్యూహానికి దీటుగా టీడీపీ కూడా బీసీలకు చాన్స్‌ ఇస్తుందా.. లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ను అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌తో పాటు తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, గల్లా మాధవి ఆశిస్తున్నారు. వీరిలో డేగల ప్రభాకర్‌ కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా, తాళ్ల వెంకటేశ్‌ బీసీ నేత. అయితే బీసీ రజక సామాజిక వర్గానికే చెందిన గల్లా మాధవి బీసీ ప్లస్‌  మహిళ కోణంలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు డేరింగ్ స్టెప్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రజక సామాజిక వర్గంలో మంచి పట్టున్న గుంటూరు జిల్లాకు చెందిన గల్లా మాధవిని గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దింపడం ఖాయం అయినట్లు తెలుస్తోంది. వైసిపి అభ్యర్థి రజినీ ని నిలువరించేందుకు రకరకాల ఈక్వేషన్లు ఆలోచించిన చంద్రబాబు బిసి ప్లస్ మహిళ కోణంలో మాధవిని దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గల్లా మాధవి ప్రస్తుతం వికాస్ హాస్పిటల్స్ కు డైరెక్టర్ గా ఉంటూ... ఎంతోమంది పేదలకు రకరకాల సేవలు అందిస్తున్నారు. మాధవి భర్త గుంటూరు తో పాటు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు తన హాస్పిటల్స్ ద్వారా అనే సేవా కార్యక్రమాలతో నగర ప్రజలకు సేవలందిస్తున్నారు. ఏదేమైనా నిన్నటి వరకు వైసిపిలో జోష్ గా ఉన్న గుంటూరు వెస్ట్ రాజకీయం ... ఇప్పుడు టిడిపి కూడా బీసీ రజక మహిళని నింపుతున్న వార్తలతో ఆ పార్టీలో  ఉలికిపాటు స్టార్ట్ అయిందని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos