ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టిడిపి-జనసేన పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత పలుచోట్ల అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు తమ అధిష్టానంతో అమీతుమీకి సిద్దమయ్యారు. ఓ జనసేన నాయకుడు  ఎమ్మెల్యే టికెట్ కోసం ఏకంగా ప్రాణాలు తీసుకుంటానని పార్టీ అదిష్టానాన్ని హెచ్చరిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన నాయకుడు విడివాడ రామచంద్రారావు ఈసారి ఎన్నికల్లో పోటీకి అంతా సిద్దం చేసుకున్నాడు. నియోజకవర్గ ఇంచార్జీగా వున్న  తనకే టికెట్ దక్కుతుందని నమ్మాడు. కానీ పొత్తులో భాగంగా తణుకు సీటు టిడిపికి దక్కింది. ఆ పార్టీ అధిష్టానం.. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి దింపింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన జనసేన నాయకుడు విడివాడ రామచంద్రారావు అనుచరులతో ఆందోళనకు దిగాడు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు విడివాడ వర్గీయుల నిరసన సెగ తగిలింది. సోమవారం రాత్రి నాదెండ్ల బసచేసిన పెంటపాడు మండలం అలంపురంలోని జయా  గార్డెన్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగాడు రామచంద్రరావు. జనసేన పార్టీ తణుకులో చాలా బలంగా వుంది... కాబట్టి ఇక్కడ పోటీ చేయాలని విడివాడ కోరారు. తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని... లేదంటే ప్రాణాలు తీసుకుంటానని విడివాడ హెచ్చరిస్తూ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే  తాడేపల్లిగూడెం పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడ్డారు.  జనసేన నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా... విడివాడ వర్గీయులను వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. ఈ సమస్య పరిష్కారానికి టిడిపి జనసేన ఉన్నత స్థాయి నాయకులు చర్చలు జరుపుతున్నారు

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos