ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కొన్నిరోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. అయితే అది స్థానం అప్పటికే మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జీగా నియమించింది. ఆయన  ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు గంజిని పక్కన పెడితే.. నియోజకవర్గంలో బలంగా వున్న పద్మశాలి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి ఆర్కే పరిస్ధితి ఏంటీ అంటే.. మీడియాలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. ఆయితే ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి  వైసీపీ ఇన్‌ఛార్జీగా ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ నియమించారు. ఆయన కూడా ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో... ఎక్కడ ఇన్చార్జిగా ఆర్కే ను నిర్మిస్తారని వార్తలు వస్తుండటంతో గడిచిన రెండ్రోజులుగా ఉమ్మారెడ్డి గుంటూరులో కనిపించకపోవడం, ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారంటూ ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఆర్కేను నరసరావు పేట లో  ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలో దింపుతారనే టాక్ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆర్కే ఇష్యూ ఇప్పుడు వై సీ పీ లోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్ లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos