ఏపీలో అధికార పార్టీ వైసిపి లో రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ వైసీపీని వీడుతున్నట్లు ఇవాళ ఒంగోలులో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తనయుడు మాగుంట రాఘవరెడ్డితో పోటీ చేయించాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఆత్మగౌరవం కలిగిన మాగుంట కుటుంబం .. కొన్ని అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు  తెలిపారు. గత ఐదేళ్లుగా మాగుంట కుటుంబానికి సహకరించిన సీఎం వైఎస్ జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీని వీడటం బాధగానే ఉందన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాగుంట శ్రీనివాసులురెడ్డి.. త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని... ఆయన తనయుడు రాఘవరెడ్టికి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తమ కుటుంబాన్ని మరోసారి ఆశీర్వదించాలని... ఆత్మగౌరవ సమస్య వల్లే వైసీపీని వీడుతున్నామని, దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. మొత్తానికి వైసీపీ నుంచి పలువురు నేతలు బయటికి వెళ్ళిపోతుoడటం తో ఆ పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Related Videos