ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు పవన్‌ భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ తాజాగా టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పవన్‌ పోటీ చేయబోయే స్థానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు పవన్‌ భీమవరం నుంచే పోటీ చేస్తారా.. చేయరా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో పవన్‌..  తన నిర్ణయం మార్చుకున్నారని... ఇప్పుడు ఆయన పిఠాపురం మీద ఆసక్తి చూపుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి పవన్‌ ఇంత అకస్మాత్తుగా తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారంటే .. కాపు ఓటు బ్యాంకు కారణమని  అంటున్నారు రాజకీయ పండితులు.  పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 90 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయని... దాంతో పిఠాపురంలో పోటీ చేస్తే తన గెలుపు ఈజీ అవుతుందని.. కాపులందరూ తనకు ఓటు వేస్తారని పవన్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే భీమవరం నుంచి తప్పుకుని పవన్ చలో పిఠాపురం అని అంటున్నారని పార్టీ లోపల బయట విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తాను పోటీ చేసేది భీమవరమా ... పిఠాపురమా ...ఎక్కడినుంచి అనేది స్వయంగా పవనే ప్రకటించాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos