ఏపీ బీజేపీ ఫుల్ కన్‌ఫ్యూజన్ లో ఉంది. అందుకే పొత్తులపై హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. పరిస్థితి ఇక్కడిదాకా తెచ్చి ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటే అసాధ్యమని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. టీడీపీ-జనసేన కూటమి పార్టీలతో బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పొత్తు అంశంలో ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం పొత్తు లేదు ఏమీ లేదు.. లోక్‌సభ సహా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పేర్కొంటున్నారు.  విజయవాడలో ఏపీ బీజేపీ పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా పొత్తుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.  ఇందులో పాల్గొన్న నేతల్లో కొందరు సమావేశంలో పొత్తుపై చర్చ జరిగిందంటే మరికొందరు మాత్రం పొత్తు ప్రస్తావనే రాలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పొత్తు అంశంపై కమలం క్యాడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని ఖరారు చేసిన బిజెపి అగ్ర నాయకులు... ఏపీలో మాత్రం ఆ ప్రక్రియను చాలా రొటీన్ గా నిర్వహిస్తున్నారు. పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లు ఖరారు చేసి పంపాలని సూచించారు.  మరోవైపు ఏపీలో బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందని, స్థానాల విషయంలో స్పష్టత లేనందుకే బీజేపీ తన తొలి జాబితాలో ఏపీ నుంచి ఎవరినీ ప్రకటించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పొత్తు విషయంపై క్లారిటీ లేకనే బీజేపీ హై కమాండ్ కూడా గందరగోళానికి గురవుతోందని విశ్లేషకులు సైతం అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos