గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. 2019 ఎన్నికల వేళ ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించినా రాకపోవటంతో తాజాగా.. వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వంశీ తర్వాత వైసీపీలో చేరడమే కాకుండా... టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ తో పాటు ఆయన కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. కాగా... 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున పోటీ చేయగా ... వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో గెలిచిన వంశీ పార్టీ మారిపోవడంతో ... ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున పోటీ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో వెంకట్రావు నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. మరోవైపు వైసీపీలో వంశీకి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టి వేధించారని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆయనతో సన్నిహితంగా లేరు. పార్టీ మారినప్పుడు ఆయనతో టీడీపీ నుంచి వెళ్లిన నేతల్లో కూడా కొంతమంది మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.. ఇలా నియోజకవర్గంలో అనేక రకాలుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉండటంతో వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఆయన గన్నవరం నియోజవర్గానికి రాలేదని అనుచరులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆయన ప్లాన్లు ఏమిటో తెలియక అనుచరులు కంగారు పడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేనందున పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos