ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... విజయవాడ లోని టీడీపీ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది.  టీడీపీకి కంచుకోటగా చెప్పుకొనే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పశ్చిమం సీటు నుంచి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా వంటి నేతలు రేసులో ఉన్నారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ గురించి చర్చ మొదలైంది. ఈ సీటును గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ క్రమంలో... విజయవాడ పశ్చిమ సీటు గురించి టీడీపీ, జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుండగా... సెంట్రల్ లో టీడీపీ నేతలు వంగవీటి రాధా, బోండా ఉమ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్  కొనసాగుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ పోస్టింగ్స్ బోండా ఉమ మద్దతుదారులే చేస్తున్నారని రాధా వర్గం ఆనుమానిస్తోంది. దీంతో, ఇప్పుడు బోండా ఉమాను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఉమాను టార్గెట్ చేసే విధంగా ఈ పోస్టింగ్స్ రాధా మద్దతు దారులే సర్క్యులేట్ చేస్తున్నారనేది ఉమా మద్దతు దారుల ఆరోపణ. 
దీంతో, ఈ సోషల్ మీడియా వార్ పైన వంగవీటి, బోండా ఉమా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos