టీడీపీకి ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను స్పీకర్ చాలా ఆలస్యం గా ఇప్పుడు ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి మూడేళ్లు కావస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం చర్చనీయాంశం అయింది. విశాఖ ఉత్తరం సీటు నుంచి 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన గంటా శ్రీనివాసరావు.. ఆ తర్వాత పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి ఫిరాయిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మూడేళ్ల తర్వాత తిరిగి యాక్టివ్ అయిన గంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి దూకారు. అప్పటి నుంచి పలు నిరసనల్లో పాల్గొంటున్న గంటా శ్రీనివాస్.. ఇదే క్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు 2021 ఫిబ్రవరిలో రాజీనామా అస్త్రం ప్రయోగించారు. విశాఖ స్టీల్ ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలోనే గంటా శ్రీనివాస్ తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లో సమర్పించారు. అయితే అది వెంటనే ఆమోదం పొందకపోవడంతో ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాంను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అయినా ఆయన స్పందించలేదు. కానీ చివరికి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం వెనుక త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. టీడీపీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్ధిని గెలిపించుకునే మెజార్టీ లేకపోయినా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులపైనా స్పందించిన స్పీకర్ .. వారికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పుడేం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos