దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ, కోల్ కతా, కేరళ రాష్ట్రాల్లో నిర్వహించే పుస్తక మహోత్సవాలకు దీటుగా ఏపీ రాష్ట్రంలోని విజయవాడ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సాహిత్య అభిమానులు, పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గతంలో జనవరి ఒకటో తేదీన ప్రారంభించే మహోత్సవాలను కరోనా తరువాత గత రెండేళ్ల నుంచి డిసెంబరులోనే ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు విజయవాడ నగరం నడిబొడ్డులోని స్వరాజ్య మైదానంలో స్టాళ్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అక్కడ అంబేడ్కర్ స్మృతివనం పనులు కొనసాగుతుండడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణానికి మార్చారు. ఈ వేదిక జాతీయ రహదారి పక్కనే ఉన్నా... నగరానికి చివరన ఉండడంతో వన్ టౌన్, ఆపై ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుసక్త ప్రదర్శన సందర్భంగా ఈ 11 రోజులపాటు సిటీ సర్వీసులు మరిన్ని నడిపితే ఎక్కువ మంది ప్రదర్శన తిలకించే అవకాశం ఉంటుంది. నిర్వాహకులు పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. వాయిస్ ..ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌషిక్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై వరహాలశెట్టి సంస్కరణ సభ, మేజిక్ షో నిర్వహించారు. రేపు 29వ తేదీన సంజీవ్ దేవ్ శతజయంతి సభ, ఓల్గా, వెన్నా వల్లభరావు పుస్తకాల ఆవిష్కరణ, 'కథ చెప్పండి' పోటీలు నిర్వహిస్తారు. 30న 'జనాభా సంఖ్య-అపోహలు- భారత రాజకీయాలు' అంశంపై సదస్సు, సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. 31న కాళీపట్నం రామారావు శతజయంతి సభ ఉంటుంది. జనవరి 1న సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్రను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జెండా ఎగురవేసి ప్రారంభిస్తారు. 2న అవంత్స సోమ సుందర్ శత జయంతి సభ, సాహితీ స్రవంతి పుస్తకాల ఆవిష్కరణ, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. 3న నేషనల్ బుక్ ట్రస్ట్ వారి పిల్లల పుస్తకాల ఆవిష్కరణ, లైఫ్ సేవింగ్ స్కిల్స్ పోటీలు ఉంటాయి. 4న సోమేపల్లి వెంకట సుబ్బయ్య సంస్కరణ సభ, ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ, పద్యాల పోటీలు జరుగుతాయి. 5న రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ, క్రియేటివ్ రైటింగ్ కార్యశాల, క్విజ్ పోటీలు ఉంటాయి. 6న ప్రజాశక్తి పుస్తకాల ఆవిష్కరణ, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. 7న జరిగే ముగింపు వేడుకలకు నటులు తనికెళ్ల భరణితోపాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరవుతారు. వీటితోపాటు ఆయా రోజుల్లో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos