ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. 175 అసెంబ్లీ సీట్లలో, 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని... బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమె ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలుగా తాను రెండు సీట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు షర్మిల. ఓవైపు తన సొంత గడ్డ అయిన రాయలసీమతో పాటు అమరావతి ప్రాంతంపై ఫోకస్ పెడుతున్న షర్మిల.. అందుకు తగినట్లే రెండు ప్రాంతాల్లోనూ పోటీకి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఒకప్పుడు తన తండ్రి వైఎస్సార్, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటులో పోటీ కోసం ప్లాన్ చేస్తున్న షర్మిల.. తన సోదరి, బాబాయ్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటును ఆమె కోసం వదిలిపెట్టే అవకాశం ఉంది. లేకపోతే పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో రెండు సీట్లను పోటీకి పరిశీలిస్తున్నారు. ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి. ఈ రెండు సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక కీలక కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లలో గతంలో ఆ పార్టీ ఆరేసి సార్లు గెలిచింది. కానీ గత దశాబ్దకాలంగా మారిన పరిస్ధితుల్లో వీటిని ఇతర పార్టీలు గెల్చుకుంటున్నాయి. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారు అయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిల అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ క్యాడర్ కాంగ్రెస్ లోకి రావడంతో పాటు గెలుపు సునాయాసం అవుతుందని ఆమె భావిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. మరోవైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించిన దేవినేని అవినాష్, విడదల రజనీలను మార్చేందుకు వైసీపీ సిద్ధపడొచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాక జగన్ ఈ సీట్లలో మార్పులు చేస్తారా చేయరా అన్న దానిపై స్పష్టత రావచ్చని వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos