ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, జనసేన ముఖ్య నేతల ఓటమికి ఎంతవరకైనా తెగించేందుకు సీఎం జగన్ తెగబడ్డారు. అందుకే అలాంటి నేతల నియోజకవర్గాలపైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నిన్నటిదాకా భీమవరంలో పోటీ చేస్తారని భావించిన జనసేనాని పవన్ ... ఆ నిర్ణయానికి గుడ్ బై చెప్పి పిఠాపురం బరిలో దిగుతారని వార్తలు వస్తుండడంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. పవన్ పైన పోటీ అభ్యర్ది ఎవరైతే బాగుoటుందనే అంశం పైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయ కర్తగా ఉన్నారు. తాజాగా వంగా గీతకు సీఎంఓ నుంచి పిలుపు రావటంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు. వంగా గీత పర్ఫామెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ చేసే వాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలని జగన్ సర్వే టీం లెక్కలు వేస్తోంది. వాస్తవంగా వంగా గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తే గీత గెలుపుకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇంఛార్జ్ గా నియమించారు. ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ తాజాగా కొత్త కోణంలో కసరత్తు మొదలు పెట్టింది. ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక ఆయన జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముద్రగడ స్వయంగా పోటీ చేస్తే పిఠాపురం సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ముద్రగడ వైసీపీలోకి రావటం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమీకరణాల పైనే తాజాగా వంగా గీతతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో..అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్దిని మార్పు చేసిన సీఎం జగన్.. పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్దిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో..పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్ది ఎవరనేది అధికారికంగా వచ్చే ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.
Read More : వైసీపీకి వసంత గుడ్ బై ... టిడిపిలో చేరిక
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos