ఏపీలో రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి వైసీపీ, అధికారంలోకి రావాలని టీడీపీ – జనసేన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో దివంగత హరికృష్ణ తనయులు, సినిమా హీరోలు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయపరంగా ఎటువైపు ఉంటారనే విషయం చర్చకు వచ్చింది. హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో సినిమా టాపిక్ తో పాటు రాజకీయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఏపీ రాజకీయాల్లో మీరు ఎటువైపు ఉంటారు... మీ కామెంట్ ఏమిటనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దివంగత నందమూరి తారక రామారావు మనవళ్లుగా కల్యాణ్ రామ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ... టీడీపీకే  సపోర్ట్ చేయాలి. కానీ కల్యాణ్ రామ్ తన ఇంటర్వ్యూలో నేరుగా ఆ మాట చెప్పలేదు. ఏ పార్టీ ఉంటామో ఆలోచించి చెబుతామని అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఇందులో ఆలోచించడానికేముందని... కల్యాణ్ రామ్ ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీకయినా సపోర్ట్ చేయాల్సి వస్తే.. కచ్చితంగా అది టీడీపీ అయి ఉండాలని వారు అంటున్నారు. ఏ పార్టీ వైపు ఉంటామనే విషయమై తానూ తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామని ఎందుకు చెప్పారనేది చర్చనీయాంశంగా మారింది. అంతగా చర్చించాల్సిన అంశాలేముంటాయి... పోనీ చర్చించాక అయినా టీడీపీని కాదని వేరే పార్టీకి వారు మద్దతు తెలపగలరా... ఈ ప్రశ్నలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ చంద్రబాబుకు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా..  అనే దాకా చర్చలు సాగుతున్నాయి. ఆ మధ్య చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చినప్పుడు.. నందమూరి ఆడపడుచును నిండు సభలో అవమానించారంటూ కుటుంబమంతా ప్రెస్ మీట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు విడిగా వీడియోలు విడుదల చేశారు. ఇటీవల చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు కూడా ఎక్కడా ఎలాంటి సందడి లేదు. బాలకృష్ణ, రామకృష్ణ ఆయన వెంట తిరిగినా, వారే మొత్తం కుటుంబం కాదు. పురంధరేశ్వరి తాపత్రయం చూస్తున్నా.. ఆమెను నందమూరి లెక్కలో వేసుకోలేం, దగ్గుబాటి ఫ్యామిలీ కోడలిగా చూడాల్సిందే. నందమూరి ఫ్యామిలీ పేరు బలంగా చెప్పుకునేది హరికృష్ణ కుటుంబం ఒక్కటే. హరికృష్ణ తనయులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మూడోతరంలో ప్రజాభిమానం పొందారు. తాతకు తగ్గ మనవళ్లుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి వారిద్దరి మద్దతు చంద్రబాబుకి ఉంటుందా... ఉండదా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై వైసీపీ- టీడీపీ కామెంట్ల ను పక్కన పెడితే... కల్యాణ్ రామ్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎవరూ స్పందించలేదు. అటు టీడీపీ, ఇటు వైసీపీ సానుభూతిపరులు మాత్రం ఒకరిపై మరొకరు కామెంట్ల వర్షం కురిపించుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos