ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేసవికాలాన్ని మించి వేడెక్కిస్తున్నది. జనసేన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు టీడీపీతో కలిసి పొత్తుల వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నది. అయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో తన సోదరుడు నాగబాబుకు కేంద్రమంత్రి పదవి వచ్చేలా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్లాన్ అదిరిపోయేలా ఉందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. జీరో పాలిటిక్స్ చేసి రాజకీయాల్లో కొత్త. ఒరవడి తీసుకొస్తానని జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నారు. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. డబ్బు ఖర్చు చేయాల్సిందేనని... నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవేళ డబ్బు ఖర్చు చేయడానికి అవసరం లేకపోతే ఇంకా మంచిది అని తన ఉద్దేశాన్ని క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. తన అన్న నాగబాబు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని... కాబట్టి ఆయన పోటీ చేయబోయే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గెలువడానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని... అందువల్ల పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు నాగబాబు గెలుపు కోసం విశాఖకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు నిధులు సేకరించే పనిని అప్పగించినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ పై పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోవడంతో.. పబ్లిక్ నుంచి పరస్పర కామెంట్స్ వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos