ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సీఎం జగన్  చేస్తున్న వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ హోరా హోరీ పోటీ ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు సినీ నటుడు ఆలీని పోటీ చేయించే స్థానం పైన అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలీని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. ఆలీని నంద్యాల ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. అయితే, ప్రత్యర్ది పార్టీల వ్యూహాలు..అభ్యర్దుల ఖరారు వేళ జగన్ తన ఆలోచన మార్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పట్టు నిరూపించుకోవటం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరడంతో పాటు ... తాజాగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో... నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా తాజాగా ఖరారు చేసిన అభ్యర్దుల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ ఖలీల్ ను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్దిత్వం పైన జగన్ కసరత్తు చేస్తున్నారు.  ఇదే సమయంలో టీడీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్దిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. అక్కడ ఖలీల్ స్థానంలో ఆలీని దింపే అంశం పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కర్నూలు ఎమ్మల్యే హఫీజ్ ఖాన్ మార్పు పైన చర్చ నడుస్తోంది. నెల్లూరు సిటీ కానీ , కర్నూలు అసెంబ్లీ సీటులో సిట్టింగ్ కానీ మార్పు ఖాయమైతే ... ఎక్కడ మార్పు జరిగితే ... అక్కడ నుంచి ఆలీని పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్ది కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. వైసిపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos