విజయనగరం జిల్లా చీపురుపల్లి టిడిపిలో లుకలుకలు మొదలయ్యాయి. చీపురుపల్లిలో తనను పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందన్న గంటా కామెంట్స్ తో అసమ్మతి సెగలు ప్రారంభమయ్యాయి. చీపురుపల్లి టిడిపి ఇన్చార్జ్ కిమిడి నాగార్జున అసమతి గళం వినిపిస్తున్నారు. మనస్థాపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దిగాలని పార్టీ నాయకులు తనను కోరినట్టు గంటా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బొత్సను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావించింది. ఇదే విషయాన్ని గంటా శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు తెలిపారు. ఈ నిర్ణయం పై గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ...విశాఖ నుంచి చీపురుపల్లి 150 కిలోమీటర్లు అని, అది వేరే జిల్లా అని, తనను విశాఖపట్టణం నుంచి పంపించేయాలని అనుకుంటున్నారా అని వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం గంటా శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టడం మాట అటుంచితే ...  నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. చీపురుపల్లికి ఇంచార్జీగా ఉన్నందున ... ఈ టికెట్ తనకే వస్తుందని కిమిడి నాగార్జున ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ నిర్ణయం ఆయనను కలిసివేసినట్టు తెలుస్తున్నది. అందుకే  పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగారు. పార్టీ పెద్దల ఫోన్లకూ నాగార్జున అందుబాటులోకి రావడం లేదు. దీంతో పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. మొత్తానికి అధిష్టానం నిర్ణయంతో చీపురుపల్లి టీడీపీలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో చీపురుపల్లిలో పోటీ చేయడానికి అయిష్టంగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... కిమిడి నాగార్జున అడుగులు ఎలా పడతాయి అనేది ఉత్కంఠ గా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos