ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ,బీజేపీ, జనసేన మధ్య పొత్తు పైన అతి త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.  రాష్ట్రంలో 2014 పొత్తులు రిపీట్ కానున్నాయని... తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక ఖాయమైందని తెలుస్తోంది. రెండు రోజుల్లోనే పొత్తుల పైన అధికారిక ప్రకటన రానుంది.  బీజేపీ నేతలతో తుది చర్చల తరువాత చంద్రబాబు ఫైనల్ గా సీట్ల ఖరారు పైన  నిర్ణయం వెల్లడించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 30 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లకు నిర్ణయం జరిగిందని... ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారని చెబుతున్నారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని...తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశం పై కూడా ప్రాధమికంగా నిర్ణయం జరిగిందని వార్తలు వస్తున్నాయి. బీజేపీకి 5 ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అతి త్వరలో దీని పైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos