టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజు విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగియనుంది. యువగళమే ప్రజాగళమై సాగిన ఈ యాత్ర... ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీవరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభం కాగా... లోకేష్ 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు, మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పాదయాత్ర ఎక్కడ ముగించారో ... ఆయన తనయుడు లోకేష్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్రను ముగిస్తుండటం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ‘వస్తున్నా...మీకోసం’ పేరిట హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించి సుమారు 208 రోజులపాటు 2,817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్‌ 27న గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని ... అధికారంలోకి వచ్చాక ఏమేం చేయదలచిందీ వివరించారు. దీని ఫలితంగానే 2014లో అధికార పగ్గాలను దక్కించుకున్నారన్నది టీడీపీ శ్రేణుల నమ్మకం. చంద్రబాబు పాదయాత్ర మగింపునకు గుర్తుగా విశాఖ నగర శివార్లలో ఉన్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్‌గేట్‌ సమీపాన శివాజీనగర్‌ ప్రాంతంలో భారీ పైలాన్‌ను నిర్మించారు. ఈ క్రమంలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా ఈ రోజు అదే అగనంపూడి టోల్‌గేటు సమీపాన ముగియనుంది. శివాజీనగర్‌ వద్ద నిర్మించిన పైలాన్‌ పక్కనే మరో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా... లోకేష్ పాదయాత్రలో పలు విశేషాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఏ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాయలసీమలోనే ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కిలోమీటర్లు నడిచారు. రాయలసీమలోనూ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ లోకేష్ పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజులపాటు సాగిన యాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 11 రోజులపాటు 225.5 కిలోమీటర్లు సాగగా... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్లు సాగింది. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు ఊహించని స్పందన లభించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడురోజులపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. నిజానికి ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నిర్వహించి, అక్కడ ముగింపు సభ ఏర్పాటుచేయాలని భావించినప్పటికీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్దే ముగిస్తున్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రభుత్వ పెద్దలు యువగళం గొంతు నొక్కేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినప్పటికీ లోకేష్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకుసాగిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. చిత్తూరు జిల్లాలో ఆయన ప్రచార వాహనాన్ని, మైకు సెట్లు, చివరకు స్టూలును కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో ముష్కర మూకలు, పోలీసులు కలిసి.. యువగళం పాదయాత్ర సైనికులను రెచ్చగొట్టి, తిరిగి వారిపైనే తప్పుడు కేసులు బనాయించినప్పటికీ లోకేష్ భయపడకుండా ముందుకు సాగడాన్ని టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపింది. 40 మంది యువగళం వలంటీర్లపై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించినా... గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్న వారితో సహా 46 మంది కీలక నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసినా లోకేష్ ఏమాత్రం బెదరలేదు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో అధికార పార్టీలో ప్రకంపనలు రేగాయి. మొత్తంగా లోకేష్ ఈ పాదయాత్రలో సుమారు కోటిన్నర మంది ప్రజలతో మమేకమయ్యారు. మొత్తంగా 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో... 70 బహిరంగ సభలు... 155 ముఖాముఖి భేటీలు నిర్వహించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు... ఎనిమిది రచ్చబండల్లో పాల్గొన్నారు. 4,353 మంది నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. 2,500 మందితో సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా... సమస్యల పరిష్కారానికి అధికారులకు 600కుపైగా లేఖలు రాశారు. పాదయాత్ర విజయవంతానికి 14 కమిటీలు ఏర్పాటుచేయగా.. వాటి సభ్యులు అనునిత్యం లోకేష్ వెన్నంటే ఉంటూ యాత్ర విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు. యువగళం ప్రధాన కో-ఆర్డినేటర్‌ కిలారి రాజేష్ పై సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేసినా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇచ్చిన అనేక హామీలు ఆయా వర్గాలకు భరోసాను కల్పించాయి. కులాలు, కార్పొరేషన్ల వారీగా ప్రజల ఆర్థిక, సామాజిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఇచ్చిన హామీలు ఆయా వర్గాలు టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేసింది. పాదయాత్రలో లోకేష్ పదునైన ప్రసంగాలతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. సీఎం జగన్‌ పాలనా వైఫల్యాలను, దోపిడీ విధానాలను ఎండగట్టడమే కాకుండా... ప్రతి సభలోనూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. వినూత్న రీతిలో కేడర్‌కు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన ‘సెల్ఫీ విత్‌ లోకేష్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తయిన ప్రతిచోటా ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మొత్తానికి రాష్ట్రంలో సంచలనం కలిగించిన లోకేష్ పాదయాత్ర ఈరోజు సక్సెస్ ఫుల్ గా ముగుస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లోనూ, ఆ పార్టీ అభిమానుల్లోనూ పెద్దస్థాయిలో జోష్ నింపుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos