ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల లెక్కలు మారిపోతున్నాయి. ప్రధానంగా వైసీపీలో ఎమ్మెల్యేలను మార్చడం,  కొత్త వారికి టికెట్లు ఇవ్వడం వంటి మార్పుల కారణంగా ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మక తప్పిదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గమైన మంగళగిరిలో సీఎం జగన్ కొత్త అభ్యర్థి కోసం మళ్లీ వేట మొదలుపెట్టడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి - ఆర్కేపై వ్యతిరేకతను అధిగమించేందుకు బీసీ అభ్యర్ధి అయిన గంజి చిరంజీవిని రంగంలోకి దింపాలని జగన్ గతంలో నిర్ణయించారు. గతంలో 2014లో టీడీపీ అభ్యర్ధిగా గంజి చిరంజీవి.. వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన పోటీని దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళగిరిలో లోకేష్ పై గంజి చిరంజీవి పోటీ ఖరారైపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలోఅక్కడ పొలిటికల్  సీన్ మారిపోయింది. తనకు బదులుగా గంజి చిరంజీవిని అభ్యర్ధిగా ప్రకటిస్తారని తెలిసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోగా.. ఆ తర్వాత వైసీపీలో సీనియర్లుగా కనిపిస్తున్న కాండ్రు కమల, ఆమె మామ, ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రచారంలోకి దిగిన గంజి చిరంజీవి.. స్ధానిక ఎమ్మెల్యే ఆళ్లను కలిసి మద్దతు అడిగేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన స్పందించడం లేదు. పోనీ ఎమ్మెల్యే అనుచరుల్ని తనవైపునకు తిప్పుకుందామని ప్రయత్నిస్తున్నా వారు నో చెప్పేస్తున్నారు. చివరికి గడప గడపకూ ప్రచారానికి వెళ్తుంటే జనంలో ఆదరణ కనిపించడం లేదు.ఇవన్నీ గమనిస్తున్న కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు రేసులోకి వచ్చేశారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి ఖాయమనే ప్రచారం మొదలుపెట్టేశారు. దీంతో గంజి చిరంజీవి సహజంగానే వెనుకబడ్డారు. ఇవే రిపోర్టులతో సీఎం జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు గంజిని డ్రాప్ చేసి కాండ్రు కమల లేదా మురుగుడు హనుమంతరావుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో లోకేష్ పై అభ్యర్ధిని ఖరారు చేసే విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్ ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos