ఏపీలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది . దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ఈ క్రమంలో వైసిపి ప్రాంతాలవారీగా జనాలను సమీకరిస్తూ 'సిద్ధం' సభలను నిర్వహిస్తోంది. ఇప్పటికే భీమిలి, దెందులూరులో సభలు నిర్వహించిన వైసీపీ నిన్న రాయలసీమలో అనంతపురం సమీపంలోని రాప్తాడులో 'సిద్ధం' సభ నిర్వహించింది. నయానో భయానో ఇలా జనాన్ని భారీగా సమీకరించడం ద్వారా జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందుతారా... ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అనేదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ తన ప్రసంగంలో తన ఐదేళ్ల పాలన గురించీ... పిల్లలు, విద్యార్థులు, మహిళలు, యువత, కుటుంబాలు, ముసలివారు.. ఇలా ఎవరెవరికి ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నదీ పదే పదే చెబుతున్నారు. అయితే... పరిశ్రమల రాక, రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం ప్రాజెక్ట్, ఇతర అభివృద్ధి పథకాల వంటి వాటి గురించి అసలు మాట్లాడనే మాట్లాడటం లేదు. ఎందుకంటే ఐదేళ్లలో ఇవేవీ ఆయన చెయ్యలేదు. అలాంటి వాటిని ప్రస్తావిస్తే, అవి నెగెటివ్ అవుతాయి కాబట్టే.. చేసినవి మాత్రమే చెప్పి, వాటిని పొందుతున్న లబ్దిదారులు మళ్లీ ఓటు వెయ్యాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకూ మధ్య ఎన్నికలు అని చెప్పడం ద్వారా.. పథకాలు పొందే పేదలే వైసీపీకి ఓటు వేస్తారని ఆయన బలంగా నమ్ముతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే టిడిపి- జనసేన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా యుహాత్మక అడుగులు వేస్తోంది. ఈ కూటమికి బిజెపి కూడా కలిసి వస్తే వైసీపీకి పెద్ద సవాల్ ఎదురైనట్లే . వైసీపీ కుట్రపూరిత రాజకీయాలు ప్రజలకు తెలిసే విధంగా... టిడిపి బహిర్గతం చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జగన్ చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారా... అతని సిద్ధం వ్యూహం ఫలిస్తుందా... ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos