నేషనల్ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌) ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఏపీ లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రతిష్టాత్మక  శిక్షణ కేంద్రాన్ని రూ.541 కోట్లతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాసిన్‌ ప్రత్యేకత ఏంటంటే... బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఈ అకాడమీకి గంట సేపట్లో చేరుకునేంత దూరం ఉంటుంది. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ లో శిక్షణ ఇచ్చే తరహాలోనే ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ - ఐఆర్‌ఎస్‌ కు ఎంపికైన వారికి ఈ నాసిన్ లోనే ట్రైనింగ్ ఇస్తారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వే లైన్‌ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణ సంస్థ ప్రారంభం సందర్భంా స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ.. పాలసముద్రం ప్రాంత ప్రత్యేకతను హైలైట్ చేశారు.  కాగా సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా...  తొలుత భారీ భద్రత మధ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి ఆలయానికి మోదీ చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. వీరభద్రేశ్వర స్వామికి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న చిత్ర ,శిల్పాలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనుపరుస్తానని ఈ సందర్భంగా ప్రధానమంత్రి  పేర్కొన్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన తరువాత ప్రధానమంత్రి  ప్రజలకు అభివాదం చేశారు. ఆనంతరం పాలసముద్రం గ్రామం చేరుకొని నాసిక్ అకాడమీని ప్రారంభించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos