ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న  క్రమంలో  టీడీపీ నుంచి టిక్కెట్ల కోసం ఆశావహులు, అసంతృప్తులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తున్నారు. తొలి జాబితాలో పేరు లేని వారు రెండో జాబితాలోనైనా తమకు టిక్కెట్ కేటాయించాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారు. వైసీపీలో టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా, వైసీపీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.  కీలక స్థానాల్లో టికెట్ ఆశించి.. భంగపడ్డ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. కొందరిని వేరే చోటు నుంచి.. మరికొందరిని ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి  మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వెళ్లి కలిశారు.  సర్వేపల్లి టికెట్ పై సోమిరెడ్డి ఆయనతో చర్చించారు. పలాస టికెట్ ను గౌతు శిరీష ఆశిస్తుండగా.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. అలాగే, ఎచ్చెర్ల టికెట్ ను కళా వెంకట్రావు ఆశిస్తున్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. మరోవైపు చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నెరవేరుస్తానని గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని...  గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కాగా త్వరలోనే రెండో జాబితా విడుదల కానున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos