ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి - ఆర్కే తిరిగి సొంత గూటికి చేరారు. మంగళగిరి నుంచి రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీడి తిరిగి రీ ఎంట్రీ అయిన వేళ ఆయన పోటీకి స్పష్టమైన హామీ లభించినట్లు తెలిసింది. ఆర్కేకు వైసీపీ నుంచి సీటు ఖాయమైందని... అయితే మంగళగిరి కాకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. సత్తెనపల్లిలో ఆర్కేకు బంధుగణంతో పాటుగా సామాజిక వర్గాల లెక్కలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. సత్తెనపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబును పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తాను ఎంపీగా అయినా..ఎమ్మెల్యేగా అయినా పోటీకి సిద్దమని..జగన్ సూచనల మేరకు ఎక్కడైనా సరే... పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో, ఆర్కే కు సత్తెనపల్లి కేటాయించి.. మచిలీపట్నం ఎంపీగా అంబటిని పోటీకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోంది. సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్దిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మంగళగిరిలో లోకేష్ పైన బరి లోకి దించిన వైసీపీ బీసీ అభ్యర్ది గంజి చిరంజీవికి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపిస్తామని ఆర్కే ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos