ఏపీలో వైసిపి ఆగడాలు, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇటీవల అమరావతి లో ఈనాడు విలేఖరి పైన, మొన్న రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపైన దాడులు చేసిన వైసిపి గూండాలు మంగళవారం సాయంత్రం కర్నూలు లోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయం పై దాడులకు దిగి అరాచకం సృష్టించారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు భారీగా ఆఫీసుకు చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం కార్యాలయ తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ లను ట్యాగ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి ఆప్రజాస్వామికమని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో జగన్ తన అనుచరులను రెచ్చగొడుతున్నారనీ, ఈ క్రమంలో మీడియాపైనా, విపక్ష పార్టీలపైనా దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. మరో 50 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడులు చేసి.. ప్రజల్లో భయనక వాతావరణాన్ని స్రుష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఏకంగా ఈనాడు కర్నూలు కార్యాలయంపైకి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసిపి రౌడీమూకల్ని వదిలారని ఆరోపించారు. నిష్ఫాక్షిక సమాచారం అందించే ఈనాడు వంటి అగ్రశ్రేణి దినపత్రిక కార్యాలయంపై వైసీపీ దాడులకు తెగబడడం రాష్ట్రంలో ఆటవిక పాలనకి పరాకాష్ట అనీ, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలాంటి మీడియాపై సైకో జగన్ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అలాగే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని విమర్శించారు. విలేకరులపై, మీడియా సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈనాడు కార్యాలయంపై దాడిని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని పవన్ మండిపడ్డారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos