త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ... వైసీపీ ఆరోజాబితాను ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 61 మందిని అసెంబ్లీ , 14 మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. ఆరో జాబితాలో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌కు వైసీపీ చెక్ పెట్టింది. ఆయన్ను కాదని జోగి అనుచరుడు తిరుపతిరావు యాదవ్‌కు టిక్కెట్ ఇవ్వడంతో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తరువాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. సిద్ధం సభకు తాను హాజరుకాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా... సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు, వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే రెండుసార్లు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ... జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇన్చార్జ్‌గా ప్రకటించింది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా... చాలారోజులుగా టీడీపీతో టచ్ లో ఉన్న వసంతకృష్ణ ప్రసాద్‌కు ఆ పార్టీ ... టికెట్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారని వసంత అనుచరులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos