ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో అన్నిపార్టీలూ అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే టికెట్లు అనే కోణంలో ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న సెగ్మెంట్లలో టికెట్లు ఇవ్వనని చెప్పడమో , సమన్వయ కర్తలను ఇతర నియోజకవర్గాలకు మార్చడం వంటి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు కూడా ఇప్పు డు గుండెదడ పట్టుకుంది. తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతల్లో సైతం ఇదేరకమైన గుబులు రేకెత్తుతోంది. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తిరుగులేని నేతలైన బి.నారాయణ రెడ్డి సోదరులదే విజయం అన్నట్లుగా అనంతపురంలో సాగేది. అది గతం.. ప్రస్తుతం బి.నారాయణరెడ్డి అన్నదమ్ములు కూడా టికెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి బి.నారాయణ రెడ్డి – బీఎన్ఆర్ 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితుల వల్ల 2009లో నారాయణరెడ్డి సోదరుడు గురునాథ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చోటు కల్పించారు. గురునాథ్ రెడ్డి అనుకున్నట్లుగానే 2009లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో అనుకొని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్‌ ... పార్టీ పెట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి గురునాథ్ రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి ఓటమి చవిచుశారు. అనంతపురం గురునాథ్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. అక్కడ కొనసాగలేక మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండటంతో ఈసారి ఎలాగైనా అనంతపురం వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు గురునాథ్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బి.నారాయణరెడ్డి కుటుంబానికి పటిష్టమైన క్యాడర్ ఉంది. గురునాథ్ రెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం రాజకీయాల్లో తెర వెనక కీలక భూమిక పోషిస్తుంటారని నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కించుకోవాలని బీఎన్నార్ సోదరులు జోరుగానే ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos