తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెమ్మదిగా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశాత్తు కింద పడి ... తుంటి ఆపరేషన్ చేసుకున్న తర్వాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. కేసీఆర్ కు మంగళహారతులతో పార్టీ మహిళా విభాగం నేతలు స్వాగతం పలికారు. ఆయన తెలంణాణ భవన్ లో కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో నీటి సమస్యలపై చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు - కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందని... బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు అలాంటి ప్రతిపాదనే చేయలేదని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ విషయమై ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ ఈ నెల 22న నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. కాగా కేసీఆర్ తుంటికి శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos