ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి  తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్య నగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల సామాన్య భక్తులందరూ అక్కడే బస చేసి ఈ రోజు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. తొలి రోజు రామ్‌లల్లాను దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీసంఖ్యలో భక్తులు ... జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. వారిని నియంత్రించడం అక్కడి సిబ్బంది వల్ల కాలేదు. ఈ క్రమంలో చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట తరువాత  తొలిరోజు అయిన ఈ రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. ఆలయంలో ప్రతి రోజు రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుంది. భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే 40గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తులు సహకరించాలని రామయ్యను దర్శించుకునేందుకు కాస్త సంమయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos