తెలంగాణలో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా ఖండించారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణిస్తూ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలోనీ అన్ని 17 పార్లమెంట్ సీట్లను గెల్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. పొత్తులపై బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించిన  తర్వాత మొదట బిజెపి నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మెడ మీద తలకాయ ఉన్న వారెవరూ బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోరని వాదించారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం.. బీజేపీతో పొత్తులంటాయన్నట్లుగా కామెంట్లు చేయడంతో.. కిషన్ రెడ్డి స్పందించక తప్పలేదు. బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక రకాల ప్రచారాలు ప్రారంభమైనా  బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎవరూ స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  అయితే  స్వయంగా కిషన్ రెడ్డి కూడా ఖండించడంతో పాటు కేసీఆర్ పై ఆరోపణలు చేయడంతో..  బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. బీజేపీపై విమర్శలు చేయకూడదన్న  విధాన నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పొత్తులపై  రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చేయడంతో  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతుందని అనుకోవచ్చు.  ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా ప్రజల్లోకి వెళ్తోంది. వచ్చే నెల రోజుల్లో ఇలాంటి మూమెంట్  కంటిన్యూ అయితే… బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   నిజానికి బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని  అంచనాలు ఉన్నాయి.  బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రణాళిక - వేసుకుందని కూడా చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ తో పొత్తుల ఆలోచన అసలు చేయడం లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. బీఆర్ఎస్ పొత్తు ఆలోచనలపై ఢిల్లీ బిజెపి పెద్దలుఇంకా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో కథ ఇంకా ఉందని అనుకోవచ్చు.   

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos