ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించడమే కాకుండా...లిక్కర్‌ కేసులో నిందితురాలిగ నోటీసులు కూడా జారీ చేసింది. తాజా పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.  గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది.  కాకా కవిత సీబీఐ విచారణకు  హాజరవుతారా...లేక కోర్టును ఆశ్రయిస్తారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత... ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos