ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 75వ  ప్లాటినం జూబ్లీ ఇయర్ వేడుకల సందర్భంగా సౌత్ జోన్ 50వ పాడి పరిశ్రమ సదస్సును  ఈ నెల 4 వ తేదీ అంటే ఈరోజు నుంచి 6వ మధ్య అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇక్కడి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతోంది.  ఈవెంట్ హైలైట్‌లో భాగంగా  5వ తేదీన కాన్‌క్లేవ్ ఉంటుంది, ఇక్కడ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పాడి పరిశ్రమ,  పశుసంవర్థక శాఖ మంత్రులు చర్చల్లో పాల్గొoటున్నారు. ఈ కాన్ఫరెన్స్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి.భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభిoచారు.  ఈ సదస్సులో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ డాక్టర్ సతీష్ కులకర్ణి, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, దొడ్ల డెయిరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివికె రెడ్డి, సంగం డెయిరీ కార్యవర్గంతో పాటు ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు డెయిరీ సంస్థల నిర్వాహకులు పాల్గొంటున్నారు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ - ఐడిఎ తన డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ - డిఐసి ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. డెయిరీ రంగంలోని కీలక సమస్యలు, ఆవిష్కరణలు, పురోభివృద్ధి పై చర్చించడానికి పాడి పరిశ్రమలు, డెయిరీ అసోసియేషన్ లు నిర్వహిస్తున్న ప్రముఖులకు ఈ సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని కాన్ఫరెన్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. డెయిరీ ఫార్మింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో తాజా ట్రెండ్‌లు, సవాళ్లు, అవకాశాలపై  ప్యానెల్ చర్చలు, ప్రెజెంటేషన్‌లను నిర్వహిస్తారు. పాడి పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి ఈ సదస్సు అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న మన దేశ జిడిపికి పాలు ఒక్కటే దాదాపు 4 శాతం దోహదం చేస్తున్నది. ప్రపంచ వృద్ధి 1.5 శాతంతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి 5 శాతం పెరుగుతోంది. మొత్తం పాల ఉత్పత్తిలో దాదాపు 20 శాతం దక్షిణ భారతదేశం నుండి వస్తుంది. దక్షిణ భారతదేశంలో మార్కెట్ చేయదగిన మిగులులో 80 శాతానికి పైగా సంఘటిత రంగం ద్వారా సేకరించబడుతోంది. ఇది జాతీయ సగటు 52 శాతం కంటే చాలా పెద్దదని అన్నారు.  సదస్సుకు హాజరైన అతిధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos