అనేక మలుపుల తర్వాత బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మీరింది. దీంతో ఇండియా కూటమి పూర్తిగా విచ్ఛిన్నమయ్యే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీరుపై వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి కన్వీనర్‌గా ఎన్నికైన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలో చేరడంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జత కట్టడంపై స్పందిస్తూ... ఈసారి తాము కలిసి ఉండబోతున్నామని అన్నారు. ‘‘ఈ మహాకూటమిలోకి నేను ఏవిధంగా వచ్చానో మీకు తెలుసు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎలా పనిచేశానో మీ అందరికీ అవగాహన ఉంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మంచిగా అనిపించలేదు. అవి నా పార్టీలో ఉన్నవారికి కూడా రుచించలేదు’’ అని నితీశ్ అన్నారు. ‘‘నేను గతంలో కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాను. వేర్వేరు మార్గాల్లో వెళ్లినప్పటికీ తిరిగి మళ్లీ కలిశాం. ఇకపై కలిసి ఉంటామని అన్నారు.నితీష్ కుమార్ 2022 జులైలో బీజేపీకి గుడ్‌బై చెప్పి... కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాకూటమిలో చేరి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చి ఎన్డీఏ లో చేరి సీఎం గా బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos