ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రధాన పార్టీల్లో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. వైసీపీ లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్ధిపై కొన్ని రోజులుగా వైసీపీవర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఎట్టకేలకు సీఎం జగన్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. నరసరావుపేట ఎంపీ స్థానంలో బరిలోకి దిగాలని అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్‌ను సూచించగా... అనిల్ కుమార్ యాదవ్ తన పోరాటానికి సిద్దం అవుతున్నారు. నరసరావు పేట ఎంపీ స్థానంపై వైసీపీ మొదటి నుంచి ఒక బలమైన బీసీ నేతను బరిలోకి దింపాలని యోచిస్తున్నది. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుంటూరు వెళ్లాలని జగన్ సూచించగా....ఆయన నిరాకరించారు. తాను నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ, అందుకు జగన్ అంగీకరించలేదు. దీంతో శ్రీకృష్ణదేవరాయులు పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో  నరసరావుపేట నుంచి ముందుగా అనుకున్నట్టే బీసీ కమ్యూనిటీకి చెందిన నేతను నిలబెట్టాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచి బరిలోకి దించారు.  దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనిల్ కుమార్ యాదవ్ సన్నద్ధం అవుతున్నారు. నెల్లూరులో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నిర్ణయం తనకు శిరోధార్యమని ... ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని, అది నరసరావుపేట లేక ఇంకో స్థానమా అనేది చూడనని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందని, ఇక నరసరావుపేట ఎంపీగా ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటానని అన్నారు. నరసరావుపేట ఎంపీగా గెలిచిన చరిత్ర నెల్లూరు జిల్లా నాయకులకు ఉందని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos