తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుపై  మాటల మంటలు చెలరేగాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంపైనా... గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.  అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి నాలుగు బస్సుల్లో వీరు పయనమయ్యారు. సాయంత్రం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించి కుంగిన బ్రిడ్జి, పిల్లర్లు పరిశీలించనున్నారు. అనంతరం అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ మీడియా సమావేశంలో నిర్వహిస్తారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. అంతకు ముందు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుక కుంగడం వల్లే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారని అన్నారు. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లో కూడా పంటలు పండించే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ... మేడిగట్ట ప్రాజెక్టు పరిశీలనకు రావాలని సభ్యులందరినీ కోరుతున్నామని చెప్పారు. మేడిగడ్డలోని వాస్తవాలను పరిశీలిద్దామని అన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని ... గత ప్రభుత్వం ఇష్టానుసారం, అడ్డగోలుగా ప్రాజెక్టులను నిర్మించిందని దుయ్యబట్టారు. అన్నిపార్టీల ప్రజలకు మేడిగడ్డను చూపించాలని నిర్ణయించామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని రేవంత్ అన్నారు. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక కదిలితే ప్రాజెక్ట్ కుంగింది అంటూ అప్పటి ప్రభుత్వం చెప్పిందని ఎద్దేవా చేశారు. అప్పట్లో ప్రాజెక్టుల వద్దకు ఎవరినీ వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారని అన్నారు. అసలు, ప్రాజెక్టుల వద్ద ఏం జరిగిందో అందరికీ పూర్తి అవగాహన ఉండాలనే మేడిగడ్డ సందర్శనకు తీసుకెళుతున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos