టీడీపీ, జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయంపై ఇద్దరు నేతలు ఎంతోకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు నిన్న వారి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, పవన్ ఒకే రోజు రెండు విడతలుగా సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని.. వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని ఒకపార్టీ వర్గం వారు చెబుతుండగా... జనసేనకు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు ... రెండు లోక్ సభ సీట్లు ఖాయం అయినట్లుగా మరో వర్గం వారు అంటున్నారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వచ్చిందని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక, బీజేపీ పొత్తు పైన కూడా స్పష్టత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల వైఖరి పైన క్లారిటీ తీసుకొని కలిసి వస్తే సీట్ల కేటాయింపు ... మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు. లేకుంటే... తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos