ఏపీలో జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరని ఇళ్లు ఉన్నాయేమో కానీ జగన్ సర్కార్ పన్నుల వాత చవిచూడని కుటుంబం మాత్రం లేదు. సంక్షేమ పథకాలపై పదేపదే ప్రచారం చేసుకునే వైసీపీ సర్కార్ రాష్ట్రంలో గడపగడపకు బడితె బాదుడు గురించి మాత్రం నోరు మెదపదు. నెలనెలా రేషన్ సరకులపై ఆధారపడే నిరుపేదల నుంచి పారిశ్రామికవేత్తల దాకా ఇంటి పన్నుల నుంచి ఇంట్లో చూసే టీవీ దాకా ప్రతి దానిపైనా జగనన్న బాదుడే బాదుడు...  పిండుడే ప్రియుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై వివిధ రూపాల్లో వేసిన పనులు, చార్జీల భారాలు చాలా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, ఆస్తిపన్ను, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, వాహనాల పన్ను ఇలా దేన్నీ వదలకుండా జనం నడ్డి విరిగేలా పన్నులు, ఛార్జీల మూత మోగించారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, బడ్జెటేతర అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం ... అవి చాలదన్నట్లు ప్రజల్ని ఛార్జీలు, పన్నుల రూపంలో పిండేస్తోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత... పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రెండు రూపాయలుగా ఉన్న అదనపు వ్యాట్ ను నాలుగు రూపాయలకు పెంచేయడమే కాకుండా రోడ్డు డెవలప్ మెంట్ పేరుతో ప్రతి లీటరుపై మరో రూపాయి అదనంగా వడ్డించింది. పెట్రోలు, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా పెరగడంతో సామాన్యులపై భారం పడకుండా చాలా రాష్ట్రాలు పనులు తగ్గించగా... జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజల ముక్కుపిండి మరీ భారీగా పన్నులు వసూలు చేస్తోంది.  సామాన్యులు ఎక్కువగా ఆధారపడే ఆర్టీసీ బస్సుల ఛార్జీల్ని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచేసింది. 2019 డిసెంబర్... 2022 ఏప్రిల్ మళ్లీ అదే ఏడాది 2022 జులై మాసాల్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపింది. ఇది అది అని కాకుండా జగన్ సర్కార్ ... విద్యుత్ ఛార్జీలపై, రేషన్ సరుకులపై, కొత్త వాహనాలు కొనుగోళ్లపై, ఇసుక, మద్యం, ఆస్తిపన్ను... ఇలా అన్నిరంగాలపైనా... అన్నివర్గాలపైన పన్నుల, ఛార్జీల భారం మోపుతూ సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఇలా పన్నుల, ఛార్జీల భారం మోపినందుకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ కు ఓటు వేసి మేం ఇంకా కష్టాలపాలు కావాలా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఈసారి జగన్ సర్కారుకు ఓటు ద్వారా సమాధానం చెప్పి గద్దె నుంచి దింపేస్తామని వారు ధీమాగా అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos