ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. టీడీపీ, జనసేన మధ్య సీట్ల కోసం పోటీ పెరుగుతుండటంతో విజయవాడ రాజకీయాల్లో టెన్షన్ నెలకొంది. విజయవాడ పశ్చిమం సీటు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. స్థానికంగా పోతిన మహేష్ ఆ సీటు ఆశిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఒక సీటు ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు టీడీపీకి చెందిన పశ్చిమ నేతలు తమకు సీటు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇక్కడ ఎప్పటి నుంచో సీటు ఆశిస్తున్నారు. తనకు విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.తనకు టికెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ బుద్దా వెంకన్న... ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ కోసం తాను కష్టపడి పని చేస్తున్నానని... తన సేవలను గుర్తించి చంద్రబాబు తనకు సీటు ఇవ్వాలని కోరారు. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా... తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబుతో పాటుగా పవన్ ను కోరుతున్నానని వెల్లడించారు. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలామంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు.అయితే, పశ్చిమం సీటుతో పాటుగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కైకలూరు, మచిలీపట్నం పార్లమెంట్ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, సీట్ల ప్రకటన వేళ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos