ఏపీలో ఎన్నికల వేళ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అటు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతుండగా... ఇదే సమయంలో ఎన్నికల సంఘం తమకు వచ్చిన ఫిర్యాదుల పైన చర్యలు ప్రారంభించింది.  అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను కేంద్రం ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఓటర్ల జాబితాలో అక్రమాల విషయంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల వేళ ఈ నిర్ణయం సంచలనంగా మారుతోంది.
  2021లో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు తయారు చేశారని, వారికి నాడు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా పని చేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పైన ఫిర్యాదులు వచ్చాయి.
ఆ ఎన్నికల సమయంలో ఆయన లాగిన్ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్ లోడ్ చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సహకరించారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.  వీటిపై ఎన్నికల సంఘం విచారణ చేయగా ... గిరీషా ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసిన విషయం నిర్దారణ అయింది. దానిపై ఇటీవల విజయవాడ లో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారుల పైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. 2021లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాల పైన బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఇప్పుడు గిరీషా ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్రం ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు దొంగ ఓట్లు, ఓటర్ల జాబితా మార్పులకు సంబంధించి... పలువురు అధికారుల పైన ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం  వీటిని పరిశీలిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos