ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో... ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ మొదలుపెట్టి ... కొందరు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగిస్తుండటమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్పు చేస్తుండటం సంచలనం కలిగిస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా టూర్లకు ప్లాన్ చేసుకుంటుండగా... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది.  తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఏపీలో రాజకీయాలపైనే కేంద్రీకృతమైంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్  వస్తుందన్న నమ్మకంతో  అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి. వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై త్వరత్వరగా నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇన్ ఛార్జిలను మార్చేశారు. అంటే అక్కడ కొత్తగా నియమితులైన వారే అభ్యర్థులని చెప్పినట్లన్న మాట. మార్చింది కేవలం 11 చోట్ల మాత్రమేనని.. కానీ మరో జాబితా ఉంటుందని ఇందులో మరికొంత మంది ఎమ్మెల్యేలతో పాటు పదిమంది మంత్రుల పేర్లు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. అధికారికంగా టిక్కెట్ రాదని తెలిసిపోయిన వారి అనుచరులు రాజీనామాల బాట పట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల  రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా... బాపట్లలో మోపిదేవి వెంకటరమణ సైలెంట్ అయిపోయారు. కానీ వారి అనుచరులు మాత్రం రాజీనామాల బాట పట్టారు. టికెట్ రాదని కంగారు పడుతున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. అలాంటి వారందరు ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు కానీ... తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ- జనసేన పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్న క్రమంలో ఆ కాంబినేషన్ పై ఆ రెండు పార్టీ నేతల్లో భారీ అంచనాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం టీడీపీ, జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. నిజానికి ఈ ద్వితీయ శ్రేణి నేతల్ని వారి గాడ్ ఫాదర్లే ముందస్తుగా ... టీడీపీ, బీజేపీ లలో చేరమని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ముందు ముందు ఈ చేరికలు మరింతగా జోరందుకోనున్నాయని తెలుస్తోంది. కాగా... వైసీపీలో వంద మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారని  తేలిపోవడంతో చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. 151 మందిని మార్చినా వైసీపీకి ప్రయోజనం లేదని కామెంట్ చేయడం ద్వారా... టీడీపీలోకి రావాలనుకునేవారికి సంకేతాలు పంపినట్లయింది. అది మైండ్ గేమా... కాదా అన్నది తెలియదు కానీ ... ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం వైసీపీ పెద్దల్లో ఆలోచన రేకెత్తించేవి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  మరోవైపు ... వైసీపీ బహిష్కృత నేతలు టీడీపీలో చేరకపోతే... జనసేనలో అయినా చేరతారన్నట్లుగా ఆ పార్టీ కూడా ఎదురుచూస్తోంది. జనసేన పార్టీకి పొత్తుల్లో భాగంగా వచ్చే సీట్లలో పోటీ చేయడానికి ఇంకా బలమైన అభ్యర్థులు లేరు. కొద్దిచోట్ల మాత్రమే ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగా పోటీ పడే నేతలు కావాలి. వారి కోసం జనసేన పార్టీ ఎదురు చూస్తోంది. వైసీపీలో అలజడితో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపేవారు పెరిగారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ మొదలుపెట్టిన కొత్త సమీకరణల వ్యూహంతో రాజకీయంగా విలవిల్లాడిపోయి ఆ పార్టీ నుంచి బయటికి రాబోయే నేతలు అటు టీడీపీలో కానీ... ఇటు జనసేనలో కానీ చేరకుండా పోతారా అని ఆ రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos