ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగుల మార్పు పంచాయతీ ఆ పార్టీకి లాభమా... నష్టమా అనే చర్చను కాసేపు పక్కన పెడితే... ఇప్పటికైతే జంప్ చేసే వారి సంఖ్య ఎక్కువవుతున్నారు. మొదటి లిస్టు తోనే ఎమ్మెల్యేలు జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు. రెండో లిస్టు విడుదల అయితే... ఇక ఎంతమంది బయటికెళతారోననేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించనున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఆయన జనసేనలో చేరడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. జగ్గంపేట నుంచి మాజీ మంత్రి తోట నరసింహంకు వైసీపీ ఈసారి టికెట్ ఇవ్వనున్నట్లుగా రెండో లిస్టు సమాచారం ప్రకారం తెలుస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఈ సమాచారాన్ని జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ... తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఈ సమాచారాన్ని జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని... దీంతో నిరాశకు గురైన జ్యోతుల చంటిబాబు తొలుత... టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.  కానీ, అక్కడ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ... చంటిబాబు చేరికపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడంతో ఇక ఆయన చూపు జనసేన వైపు మళ్లిందని అంటున్నారు. గతంలో జ్యోతుల చంటిబాబు టీడీపీ నుంచి 2009, 2014 ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో పార్టీ మారి వైసీపీలో చేరి ... జగ్గంపేట నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి టికెట్ దక్కదని స్పష్టం కావడం వల్లనే జనసేనలో చేరడానికి గాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారని సమాచారం. ఈ రాజకీయ పరిణామాలపై జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ పిలిస్తేనే వెళ్లి మాట్లాడానని... ఆయన జిల్లా రాజకీయాలపై అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని... వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos