ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ నెల రెండోవారంలో అభ్యర్థులను ప్రకటించి... జనసేనాని పవన్ తో కలిసి ఉమ్మడి ప్రచారానికి సిద్ధం కావాలని ప్లాన్లు రచిస్తున్నారు. ఈ క్రమంలో... వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని జనసేన ఆశించింది. అయితే... ఈ సీటును మాజీ మంత్రి నారాయణకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తిరిగి నెల్లూరు రూరల్ స్థానాన్ని కేటాయించారు. వెంకటగిరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి అదే స్థానం కావాలని చంద్రబాబును కోరారు. కానీ... అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కు సీటు కేటాయించి... ఆనం రామనారాయణరెడ్డి కి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. గూడూరు అభ్యర్థిగా పాశం సునీల్ కుమార్ పేరు ఖాయం చేశారు. కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న కావలి ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరితే నెల్లూరు ఎంపీగా ఆయన్ను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. అయితే, జిల్లాలో వైసీపీ అభ్యర్థుల తుది జాబితా వచ్చిన తరువాత ఎంపీ సీటు పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఈ జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అభ్యర్థుల గెలుపు ఓటముల పైన సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos