‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. వారిని ఓదార్చి ఆర్థికసాయం అందిస్తారు. రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మంగళగిరి, గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 6వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో, 7వ తేదీన తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 8వ తేదీన తాడికొండ నియోజకవర్గంలో, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు. ఇదిలావుండగా... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన క్రమంలో... ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి రావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos