ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఖాళీ అవనున్న మూడు రాజ్యసభ స్థానాలను...తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది. సంఖ్యా బలంపరంగా చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. మరోసారి అలాంటివి ఛేదు ఫలితాలు రాకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి...ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తేల్చింది. దీంతో గత దాటిన తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అటు ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వైసీపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్య...వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో వంశీ కృష్ణ యాదవ్... టీడీపీలో సి. రామచంద్రయ్య చేరిపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిట్టింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలకు టచ్‌లోకి వెళ్లారు. టీడీపీ సభ్యుల బలాన్ని తగ్గిస్తే...రాజ్యసభ ఎన్నికల్లో సులభంగా గెలుపొందవచ్చని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా గంటా రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపైనే త్వరలో వేటు వేసే అవకాశం ఉంది. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే... టీడీపీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గిపోతాయి .తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే... టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసీపీ. ఈ వ్యవహారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos