ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వైఎస్సార్సీపీ రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టిన మార్పులు- చేర్పుల వల్ల బాధితులైన కొంతమంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో... వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి మారిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతో... 2024లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనే యోచనతోనే తాను పార్టీ మారాను అని ఆయన చెబుతున్నారు. వైసీపీలో పోటీ చేసే వాతావరణం లేదు కాబట్టి ఇలా చేశానని కూడా అంటున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ... వ్రతం చెడినా ఫలితం దక్కుతుందా వంశీ అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా... ఆయనకు మరో అయిదేళ్ల పాటు పెద్దల సభలో కొనసాగే అవకాశం ఉంది. 2028 దాకా శాసనమండలిలో మెంబర్ గా ఉండవచ్చు. కానీ దాన్ని కూడా కాదనుకుని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని భావించి వైసీపీ నుంచి బయటికొచ్చారని అంటున్నారు.  వంశీ తొలుత 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మళ్లీ విశాఖ తూర్పు నుంచే పోటీ చేశారు కానీ మళ్లీ ఓటమి పాలయ్యారు. 2019లో టికెట్ రాలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు కానీ... ఆయన హ్యాపీగా ఉండలేకపోయారు. 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి... వైసీపీలో విశాఖ తూర్పు టికెట్ తనకు దక్కుతుందని ఆశపడ్డారు. అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నుంచి పోటీకి దిగబోతుండటంతో వంశీకి చోటు దక్కలేదు. దాంతో ఆయన జనసేనలోకి మారారు. అయితే వంశీకి జనసేనలో కూడా విశాఖ తూర్పు టికెట్ దక్కే అవకాశం లేదు. దాంతో సిటీలో ఎక్కడైనా పోటీకి రెడీ అని వంశీ అంటున్నారు. కానీ జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లు ఎన్ని ... అందులో వంశీని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ గా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంశీని మొదటి నుంచి బ్యాడ్ లక్ ఇబ్బంది పెడుతోందని... ఇపుడు జనసేన అయినా ఆయన జాతకాన్ని మార్చనున్నదా అని... ఆయన అనుచరులు ఆశ పడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos