ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర‌్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలన కోసం నాలుగేళ్ల బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ లను ప్రవేశ పెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ... తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ... నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని గవర్నర్ ప్రసంగిస్తుండగా... టీడీపీ సభ్యులు అడ్డుపడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్ వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు.  మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అని, ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నీ అసత్యాలు సార్ అని నినాదాలు చేస్తూ... గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వారు వాకౌట్ చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వారు  అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో భైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. అంతకుముందు అంటే సమావేశాల ప్రారంభానికన్నా ముందు... టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుకుంటూ అసెంబ్లీకి వెళుతూ బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వైసీపీ పని అయిపోయిందని... టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని... అందుకే పోలీసుల సాయంతో మమ్మల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సీఎం జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని జోస్యం చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos