టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా అంటూ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న క్రమంలో ... ఈ రోజు ఏలూరు జిల్లా చింతలపూడిలో హాజరుకానున్న సభాస్థలి సమీపంలోని హెలీప్యాడ్ వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది.  హెలీపాడ్ వద్ద మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేస్తుండగా ఒక్కసారిగా శబ్దం వెలువడింది. హెలీప్యాడ్‌ వద్ద సిగ్నల్‌ బజర్‌ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌ కూడా తనిఖీలు చేపట్టారు. శబ్దం వెలువడిన ప్రాంతంలో తవ్వగా ఇనుప రాడ్ బయటపడింది. దీంతో సిబ్బంది, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు చింతలపూడికి బయల్దేరారు. అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా... సమీపంలోని హెలీ ప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సిగ్నల్ బజర్ మోగడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. కాగా చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో సభ ముగించుకుని చింతలపూడికి రావాల్సి ఉంది. అయితే, చింతలపూడి సభ వద్ద హెలీప్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు తొలుత అధికారులు అనుమతి నిరాకరించారు. తరువాత... ఆలోచించి... మాడుగల సభ ముగించుకుని వచ్చే సమయానికి హెలీప్యాడ్ సిద్ధం చేస్తామని తెలిపారు. ఇదిలావుండగా... చంద్రబాబు రా.. కదలిరా కార్యక్రమం కింద రోజుకు రెండు చొప్పున భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన .. మళ్లీ ఈ రోజు నుంచి సభలు ప్రారంభించారు. ఈ రోజు మాడుగుల, చింతలపూడి సభల్లో పాల్గొనేలా ముందుగానే ప్లాన్ చేసుకుని... ఆ మేరకు టూర్ లో పాల్గొంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos