ఈ నెల 25 నుంచి అంటే రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వ‌రుస విజ‌యాల‌తో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్.. సొంత‌గ‌డ్డ‌పై తిరుగులేని శ‌క్తిగా ఉన్న టీమిండియా మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. 2012లో 2-1 తేడాతో భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గింది ఇంగ్లాండ్. ఆ షాక్ ఓటమి తర్వాత స్వదేశంలో భారత్ 16 సిరీస్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆ ఓట‌మి త‌ప్పుల‌ను స‌రిదిద్దుకున్న భార‌త్.. సొంత గ‌డ్డ‌పై టెస్టుల్లో తిరుగులేని శ‌క్తిగా మారింది. సొంతగ‌డ్డ‌పై భారత్ తిరుగులేని శ‌క్తిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇంగ్లాండ్ జ‌ట్టును అంత తేలిక‌గా తీసి పారేయలేం. బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లాండ్ జ‌ట్టు బాజ్ బాల్ వ్యూహంతో భార‌త్ ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తోంది. బాజ్ బాల్ వ్యూహంతో గ‌త రెండేళ్లలో ఇంగ్లాండ్ టెస్టుల్లో విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా ముందుకు సాగుతోంది. ఇక ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టేందుకు భార‌త్ కూడా వ్యూహాలు ర‌చిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పై దృష్టి పెట్టింది. బౌలింగ్ లో ముఖ్యంగా భార‌త్ పిచ్ లు స్పిన్న‌ర్ల‌కు మ‌రింత అనుకూలించే అవ‌కాశ‌ముంది. భారత సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఇంగ్లాండ్ బ్యాట్స్ మ‌న్ ఎలా ఎదుర్కొంటారనేది సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్ప‌వ‌చ్చు. అలాగే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండటంతో పరిస్థితులు అనుకూలిస్తే భారత్ నలుగురు నాణ్యమైన స్పిన్నర్లను ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడించే అవకాశం ఉంది. కాగా భార‌త్ టీమ్ కు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ దూరం కావ‌డం పెద్ద ఎదురుదెబ్బే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos