తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపైన, వారి ఆస్తులపైన దృష్టి పెట్టడంతో ఆ పార్టీ నేతలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని ఇటీవల ఆయనకి చెందిన కాలేజీ రోడ్డును తొలగించగా.. ఇప్పుడు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామరచెరువు సమీపంలో ఆయనకు చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. దీనిపై వారం క్రితమే ఆయా యాజమాన్యాలకు నోటీసులిచ్చారు. తాజాగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ,దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేసుకోగా... వారికి పోలీసులు సద్ది చెప్పారు. అయినా... అల్వాల్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ తో రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో డిప్యూటీ కమిషనర్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకే రోజు ఎమ్మెల్యేకు చెందిన కాలేజీని కూల్చివేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos