పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ ఆ దేశ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నాడన్న వార్త  ఒక్కసారిగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటు క్రికెట్, అటు టెన్నిస్ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహ బంధం ముగిసిపోనుందని, వారిద్దరూ విడాకుల ఆలోచనల్లో ఉన్నారని గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేసిన సంగతీ తెలిసిందే. నటి సనా జావెద్‌ను వివాహం చేసుకోవడం ద్వారా షోయబ్ ఆ వార్తలను నిజం చేశాడు. సనా జావెద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త వైరల్ కావడంతో ఇంతకీ ఆమె ఎవరన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. 1993 జూన్ 6న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించిన సనా జావెద్...  ఉర్దూ టెలివిజన్ చానల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. ఆమె పూర్వీకులు మన హైదరాబాద్ వారే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. 2012లో ‘షెహర్-ఇ-జాత్’ అనే సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సనా.. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ స్క్రీన్ పైనా, మోడలింగ్ లోనూ ఆమె కెరీర్ కొనసాగింది. 2020లో టెలివిజన్ రియాలిటీ గేమ్ షో ‘జీతో పాకిస్థాన్ లీగ్‌’లో ఇస్లామాబాద్ డ్రాగన్స్‌కు కెప్టెన్‌‌గానూ వ్యవహరించింది. 2020 అక్టోబరులో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. అయితే, గత ఏడాది చివర్లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు షోయబ్ మాలిక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పలు షోలలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరిగింది. గత ఏడాది సనా బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోను షేర్ చేసిన షోయబ్ ‘హ్యాపీ బర్త్ డే బడ్డీ’ అని పోస్టు పెట్టడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇదిలాఉండగా షోయబ్ మాలిక్‌తో విడాకుల వ్యవహారంపై సానియామీర్జా కుటుంబం స్పందించింది. పాకిస్థాన్ నటిని పెళ్లాడిన షోయబ్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ.. షోయబ్‌తో సానియా విడాకులు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించింది. వీరిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయినట్టు స్పష్టం చేసింది. సానియా ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితంలో గోప్యత పాటించిందని, కానీ ఇప్పుడు ఓ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సానియామీర్జా, షోయబ్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. షోయబ్ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని సానియా ఆకాంక్షించినట్టు తెలిపింది. తమ గోప్యతను గౌరవించి, ఊహాగానాలకు దూరంగా ఉండాలని సానియా అభిమానులను కుటుంబం అభ్యర్థించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos