కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలన్న తదితర డిమాండ్లతో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది . నిన్న పంజాబ్, హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద హింస చెలరేగింది. 21 ఏళ్ల యువ రైతు శుభ కరణ్ సింగ్ తలకి బులెట్ గాయం కావడంతో మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.ఆందోళనకారుల రాళ్ల దాడిలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో చలో ఢిల్లీ నిరసనను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. కాగా రైతులు ఆందోళనలు చేపట్టిన 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తొలిసారిగా స్పందించారు.  రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ - ఎఫ్ఆర్పీ కంటే 8 శాతం అధికానికి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. సవరించిన ఎఫ్ఆర్పీ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో యుద్దవాతావరణం కొనసాగుతోంది.  రైతులు వెనక్కి తగ్గడం లేదు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో  అంగీకరించకుంటే మరింతగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos